Monday, February 3, 2020

కోళ్ళ జాతులు


1.కారీ నిర్ బీక్ ( అసీల్ క్రాస్/నాటు కోళ్లు )


అసీల్ అంటే ‘స్వచ్ఛత’ (నాటు కోళ్లు ) అని అర్థం. ఈ జాతి కోళ్ళు బాగా బలంగా,
ఠీవితో తట్టుకునే శక్తి ఎక్కువగా, 
దెబ్బలాడే గుణం కలిగి ఉంటాయి.
ఈ జాతి కోళ్ళకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పుట్టినిల్లు.
ఈ కోళ్ళ చాలా పెద్దవిగా, అందంగా ఉంటాయి.
పుంజులు 3-4 కిలోల వరకు బరువు ఉండి, పెట్టలు 2-3 కిలోల ఉంటాయి.
గ్రుడ్లు పెట్టే వయస్సు 196 రోజులు
సంవత్సరములో గ్రుడ్లు ఉత్పత్తి -92
7. 40 వారాల వయస్సులో గ్రుడ్ల బరువు 50గ్రా.

2.కారీ శ్వామా (కడకనాథ్ క్రాస్)

ప్రాంతీయంగా ‘కలమాశి’ అంటారు, అంటే దీని అర్ధం నల్లని మాంసం కలది – మధ్యప్రదేశ్ లోని జాబ్యూ మరియు ధర్ జిల్లాలు, రాజస్ధాన్ మరియు గుజరాతీ సరిహద్దు ప్రాంతాలలో సుమారు 800 చ. మైళ్ళ విస్తీర్ణంలో వ్యాపించి వుంటాయి .
వీటిని ఎక్కువగా కొండ జాతులు, ఆదివాసి ప్రజలు,గ్రామీణ ప్రాంతాలలో పెంచుతారు. దీనిని పవిత్ర మైన జాతిగా గుర్తించి, దీపావళి పండుగలో దేవునికి నైవేధ్యంగా పెడతారు.
రోజుల కోడి పిల్ల నీలం రంగు నుంచి నలుపు వరకు ఉండి, వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. ఈ జాతి మాంసం నల్లగా ఉన్నా, దీనికి చాలా ఔషధ విలువలతోపాటు.సెక్సు సామర్ధ్యాన్ని పెంచుతుందని నమ్ముతారు
ఆదివాసీ దీని రక్తాన్ని చాలా దీర్ఘ కాల జబ్బులకు ఉపయోగిస్తారు.
గ్రుడ్లు, మాంసం లో ప్రొటీన్లు (25.47%) మరియు ఇనుము ఎక్కువగా ఉంటుంది.
20 వారాల వయస్సులో 920గ్రాముల బరువు ఉంటుంది.
గ్రుడ్లు పెట్టే వయస్సు – 180 రోజులు.
సంవత్సరనికి గ్రుడ్ల ఉత్పత్తి – 105
40 వారాల వయస్సుకి గ్రుడ్ల బరువు 49 గ్రా
గ్రుడ్లు పెట్టే సామర్ధ్యం - 55%

3.హితకారీ ( నేకడ్ నెక్ క్రాస్)

ఈ జాతి పెద్దగా ఉండి పొడవైన ఈకలు లేని మెడ ఉంటుంది.
మగ కోడిలో పరిపక్వ దశకు వచ్చే సరికి మెడ భాగం ఎర్రగా మారుతుంది.
కేరళ లోని త్రివేండ్రం దీనికి పుట్టినిల్లు.
20 వారాలు వయస్సులో దాని బరువు 1005 గ్రా
గ్రుడ్లు పెట్టే వయస్సు 201 రోజులు.
గ్రుడ్ల ఉత్పత్తి సంఖ్య 99 సంవత్సరానికి
40 వారాలు వయస్సులో గ్రుడ్లు బరువు 54 గ్రా
గ్రుడ్లు పెట్టే సామర్ధ్యం - 66%

4.ఉపకారి (ఫ్రిజెల్ క్రాస్)

దేశవాళీ కోడిలాగా ఉండి, ఉష్ణ ప్రాంతాలకు, బాగా అలవాటు పడి, రోగనిరోధక శక్తి బాగా ఉండి, మంచి పెరుగుదల, ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటుంది.
పెరటిలో పెంచేందుకు బాగా అనువైనది.
ఉపకారి కోళ్ళ వివిధ వాతావరణ పరిస్ధితులకు అనువైన రకాలు
కడకనాధ్ x డెహలామ్ రెడ్
అసిల్ x డెహలామ్ రెడ్
నేకడ్ నెక్ x డెహలామ్ రెడ్
ఫ్రిజిల్ x డెహలామ్ రెడ్
గ్రుడ్లు పెట్టేందుకు వయస్సు – 170-180 రోజులు.
వార్షిక గ్రుడ్ల ఉత్పత్తి – 165-180 గ్రుడ్లు
గ్రుడ్ల బరువు – 52-55గ్రా
బ్రౌను రంగు గ్రుడ్లు
గ్రుడ్లు నాణ్యత బాగుంటుంది.
బతకగల సామర్ధ్యం 95%

5.లేయర్లు
కారీ ప్రియ లేయరు

మొదటి గ్రుడ్డు పెట్టే వయస్సు – 17-18 వారాలు
150 రోజులకు 50% ఉత్పత్తి
26 నుంచి 28 వారాలకు ఎక్కువ ఉత్పత్తి
బతకగల సామర్ధ్యం 96%
గ్రుడ్డు సైజు సాధారణంగా ఉంటుంది.
గ్రుడ్డు బరువు 54గ్రా

6.కారీ సొనాలి లేయరు (గోల్డెన్ -92)

మొదటి గ్రుడ్డు పెట్టే వయస్సు – 18-19 వారాలు
155 రోజులకు 50% ఉత్పత్తి
27 నుంచి 29 వారాలకు ఎక్కువ ఉత్పత్తి
బతకగల సామర్ధ్యం 96%
గ్రుడ్డు సైజు సాధారణంగా ఉంటుంది.
గ్రుడ్డు బరువు 54గ్రా

7.కారీ – దేవేందర్


మద్యస్థ సైజు ఉన్న రెండు అవసరాలకు సరిపడే కోడి
మేత ఖర్చు కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది.
ఇళ్ళ దగ్గర చనిపోయే శాతం తక్కువ.
8 వారాలకు కోడి బరువు – 1700-1800 గ్రా
గ్రుడ్లు పెట్టేందుకు వయస్సు- 155-160 రోజులు
వార్షిక గ్రుడ్లు ఉత్పత్తి 190-200

8.బ్రాయిలర్లు

కారీబ్ర్ –విషాల్ ( కారీబ్రో -91
రోజుల పిల్ల బరువు – 43 గ్రా
2. ఆరు వారాల వయస్సు ఉన్న కోడి బరువు – 1650 - 1700గ్రా
3. ఏడు వారాల వయస్సు ఉన్న కోడి బరువు- 2100-2200గ్రా
డ్రెసింగ్ శాతం 75%
బతకగల సామర్థ్యం 97-98%
ఆరు వారాలకు ఫీడ్ కన్వర్షెన్ నిష్పత్తి 1.94 -2.20

9.కారీ – రైన్ బ్రో (బి-77)

రోజుల పిల్ల బరువు –41 గ్రా
ఆరు వారాల వయస్సు ఉన్న కోడి బరువు – 1300 గ్రా
ఏడు వారాలు వయస్సు ఉన్న కోడి బరువు- 1600 గ్రా
డ్రెసింగ్ శాతం 73%
బతకగల సామర్థ్యం 98-99%
ఆరు వారాలకు ఫీడ్ కన్వర్షెన్ నిష్పత్తి 2.3

10.కారీబ్రో – ధనరాజు ( రంగులది)

రోజుల పిల్ల బరువు –46 గ్రా
ఆరు వారాల వయస్సు ఉన్న కోడి బరువు – 1600-1650 గ్రా
ఏడు వారాల వయస్సు ఉన్న కోడి బరువు- 2000-2150 గ్రా
డ్రెసింగ్ శాతం 73%
బతకగల సామర్థ్యం 98-99%
ఆరు వారాలకు ఫీడ్ కన్వర్షెన్ నిష్పత్తి 1.90-2.10

11.కారీబ్ర్ – మృత్యుంజయ్ (కారీ నేకడ్ నెక్)


రోజుల పిల్ల బరువు –42 గ్రా
ఆరు వారాల వయస్సు ఉన్న కోడి బరువు – 1650-1700 గ్రా
ఏడు వారాల వయస్సు ఉన్న కోడి బరువు- 2000-2150 గ్రా
డ్రెసింగ్ శాతం 77%
బతకగల సామర్థ్యం 97-98%
ఆరు వారాలకు ఫీడ్ కన్వర్షెన్ నిష్పత్తి 1.9-2.0

12.క్వయిల్

ప్రస్తుత కాలంలో జపనీస్ క్వయిల్ ఒక సంచలనం సృష్టించింది. దేశంలో చాలా చోట్ల గ్రుడ్లకు మరియు మాంసం కొరకు దీని పెంపకాన్ని వ్యాపారపరంగా చేపడుతున్నారు.
వినియోగదారుల నుండి ఈ విధమైన నాణ్యమైన మాంసానికి మంచి గిరాకీ వుంది

ఈ పక్షుల పెంపకం లాభసాటిగా ఉంటుంది దానికి కారణాలు :
సంవత్సరానికి వీటి ఉత్పత్తి మూడు నుంచి నాలుగు తరాల వరకు జరుగుతుంది.
రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ.
వ్యాక్సిన్ లు వేయనవసరం లేదు.
తక్కువ నేల అవసరమవుతుంది.
పెంచడం సులభం
తొందరగా పరిణితి చెందుతుంది.
42 రోజుల వయస్సు లోనే ఇవి గ్రుడ్లు పెడతాయి.

13.కారీ ఉత్తమ్(broiler quail)

గ్రుడ్లు పొదిగే శాతం 60-76%
నాలుగు వారాలకు బరువు 150గ్రా
ఐదు వారాలకు బరువు 170-190గ్రా
నాలుగు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.51
ఐదు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.80
రోజు వారీ తినే మేత సామర్ధ్యం 25-28గ్రా
White Breasted Quai
14.కారీ ఉజ్వల్

గ్రుడ్లు పొదిగే శాతం 65%
నాలుగు వారాలకు బరువు 140గ్రా
ఐదు వారాలకు బరువు 170-175గ్రా
ఐదు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.93
రోజు వారీ తినే మేత సామర్ధ్యం 25-28గ్రా

15.కారీ శ్వేత

గ్రుడ్లు పొదిగే శాతం 50-60%
నాలుగు వారాలకు బరువు 135గ్రా
ఐదు వారాలకు బరువు 155-165గ్రా
నాలుగు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.85
ఐదు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.90
రోజు వారీ తినే మేత సామర్ధ్యం 25గ్రా

16.కారీ పరల్ (కారీ ముత్యం)

గ్రుడ్లు పొదిగే శాతం 65-70%
నాలుగు వారాలకు బరువు 120గ్రా
రోజు వారీ తినే మేత సామర్ధ్యం 25గ్రా
50% గ్రుడ్లు ఉత్పత్తి చేసే వయస్సు 8-10 వారాలు

17.గునియా కోళ్ళు(గిన్ని కోళ్ళు)

చిన్న, సన్న కారు రైతులకు పెంచుటకు అనువైనది.|స్వేచ్చగా తిరిగి జీవించే జాతి
కాదంబరి, చితంబరి, శ్యేతాంబరి అను రకాలు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్య లక్షణాలు
చాలా దిట్టమైన పక్షి
ఏలాంటి వాతావరణానికైనా అనువైనది.
కోడికి వచ్చే చాలా జబ్బులను తట్టుకోగలదు
వీటి పెంపకం చాలా సులభతరం
మైకోటాక్సిన్ మరియు ఎఫ్లటాక్సిను తట్టుకోగలదు
అన్ని రకాల మేతను తింటుంది
గ్రుడ్లు పెంకు గట్టిగా ఉన్నందువల్ల, పగలటం తక్కువగా వుండి, ఎక్కువ రోజులు నిల్వ వుంటాయి.
దీని మాంసం లో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి మరియు క్రొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.

ఉత్పత్తి లక్షణాలు
8 వారాలకు బరువు 500 -550 గ్రా
12 వారాలకు బరువు 900-1000 గ్రా
మొదటి గ్రుడ్డు పెట్టేటప్పుటికి వయస్సు 230-250 రోజులు
గ్రుడ్డు బరువు 38-40గ్రా
గ్రుడ్లు ఉత్పత్తి 100-120
గ్రుడ్లు పెట్టే సామర్ధ్యం 70 – 75 %
గ్రుడ్లు పొదిగే సామర్ధ్యం 70 - 80%

No comments:

Post a Comment